కార్పొరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాల భవనం
ABN, First Publish Date - 2023-08-14T00:09:30+05:30
కొత్తూర్ మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల జేపీ దర్గా సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) భవనం ప్రారంభానికి సిద్ధమైంది. షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కృషితో 4కోట్ల 20లక్షల రుపాయలతో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా భవనాన్ని నిర్మించారు.
కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం
కొత్తూర్, ఆగస్టు 13: కొత్తూర్ మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల జేపీ దర్గా సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) భవనం ప్రారంభానికి సిద్ధమైంది. షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కృషితో 4కోట్ల 20లక్షల రుపాయలతో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా భవనాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇన్ముల్‌నర్వ మాజీ సర్పంచ్ పెంటనోళ్ల కమలమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఈ భవనం అత్యాధునిక హంగులతో అన్ని సదుపాయాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పెద్ద గుట్టపై ఈ పాఠశాల భవనం నిర్మించడంతో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. అత్యాధునిక హంగులతో గిరిజన గురుకుల పాఠశాల నిర్మిచేందుకు కృషి జరిపిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కొత్తూర్ వైస్ ఎంపీపీ శోభలింగంనాయక్, ఇన్ముల్‌నర్వ సర్పంచ్ అజయ్‌మిట్టునాయక్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పెంటనోళ్ల యాదగిరి, గోపాల్‌నాయక్, గిరిజన సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమయత్తమవుతున్నారు.
Updated Date - 2023-08-14T00:09:30+05:30 IST