ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా తీజ్‌ వేడుక

ABN, First Publish Date - 2023-09-04T00:03:43+05:30

మండల పరిధి పల్లె చెలక తండాలో ఆదివారం తీజ్‌ వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల నేపథ్యంలో సర్పంచ్‌ లోకేశ్‌నాయక్‌, ఎంపీటీసీ పాలకూర్ల రాములు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

తీజ్‌ వేడుకల్లో నృత్యం చేస్తున్న గిరిజనులు, కాంగ్రెస్‌ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి

కడ్తాల్‌, సెప్టెంబరు 3: మండల పరిధి పల్లె చెలక తండాలో ఆదివారం తీజ్‌ వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల నేపథ్యంలో సర్పంచ్‌ లోకేశ్‌నాయక్‌, ఎంపీటీసీ పాలకూర్ల రాములు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల గిరిజనులు వేడుకకు తరలి రావడంతో తండా జనసంద్రమైంది. కార్యక్రమానికి కాంగ్రెస్‌ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి, జెడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ హాజరయ్యారు. మొలకల బుట్టలను ఆలయాల్లో ఉంచి పూజలు నిర్వహించారు. అవివాహిత యువతులు, చిన్నారులు మొలకల బుట్టలు ఎత్తుకొని నృత్యాలు, బ్యాండ్‌ మేళాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొలకల బుట్టలను చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సీతారామ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, మండల రైతు సమితి అధ్యక్షుడు వీరయ్య, చరికొండ సర్పంచ్‌ భారతమ్మనర్సింహాగౌడ్‌, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బిచ్యానాయక్‌, రాములు, వెంకటేశ్‌, బిక్య, శ్రీను, రమేశ్‌, బాల్‌దాస్‌, మల్య, మాన్‌సింగ్‌, బాలునాయక్‌, దీప్ల, చంద్రయ్య, హరిచంద్ర, మహేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising