ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2023-06-02T23:52:10+05:30

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు తరలించి రైతుల దగ్గర నిల్వ ఉన్న వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చౌడాపూర్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

చౌడాపూర్‌ తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, జూన్‌ 2: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు తరలించి రైతుల దగ్గర నిల్వ ఉన్న వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చౌడాపూర్‌ మండల కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. చౌడాపూర్‌ తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌ను శుక్రవారం కలిసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ చౌడాపూర్‌ మండల అధ్యక్షుడు అశోక్‌ మాట్లాడుతూ.. రైతులు ట్రాక్టర్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి 5నుంచి 10 రోజులు అవుతుందని, తూకాలు వేయడంలేదని తెలిపారు. గతంలో తెచ్చి బస్తాలను తూకంవేసి ఇక్కడే నిల్వ ఉంచారని తెలిపారు. వాటిని లారీల ద్వారా మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యాన్ని తెచ్చిన రైతులు తూకాలు వేయకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు పంపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising