ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’తో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

ABN, First Publish Date - 2023-02-07T00:17:29+05:30

ధరణి పోర్టల్‌తో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సిములు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌల్తాబాద్‌, ఫిబ్రవరి 6: ధరణి పోర్టల్‌తో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సిములు ఆరోపించారు. సోమవారం దౌల్తాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదనే సీఎం కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు ఇంటింటికీ టీడీపీ నినాదంతో ముందుకు వెళ్తారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతమందికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్లుకట్టించిందో తెలపాలన్నారు. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయన్నారు. రాజకీయాల కోసం ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న బకాసురుడు కేసీఆర్‌ అన్నారు. అన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లో పర్యటించి బీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ బాలకిషోర్‌యాదవ్‌, నారాయణ, బిచ్చిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising