ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2023-02-07T23:59:24+05:30

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

ముదిరాజ్‌ సంఘం నాయకులకు సర్టిఫికెట్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, ఫిబ్రవరి 7: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నాగర్‌కుంట మత్స్యసంఘం సర్టిఫికేట్‌ను సంఘం నాయకులు పి.నర్సింహులు, సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, మత్స్యశాఖ అధికారుల చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు ఎన్‌.లింగం, గౌరవ అధ్యక్షులు కె.వెంకటయ్య, ప్రధానకార్యదర్శి పి.మాసయ్య, కార్యదర్శి పోచయ్య సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

భూనిర్వాసితులకు న్యాయం చేయండి

చందన్‌వెళ్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అఖిలపక్షం నాయకులు ఎమ్మెల్యే యాదయ్యకు బాధిత రైతులతో కలిసి మంగళవారం వినతిప్రతం అందజేశారు. చందన్‌వెళ్లిలోని సర్వే నెంబర్‌ 190లో టీఎ్‌సఐఐసీ భూసేకరణలో 110మంది రైతులకు నష్టపరిహారం అందలేదని వారు గత ఆరు నెలలుగా హైతాబాద్‌ చౌరస్తాలో దర్నా నిర్వహిస్తున్నా, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదన్నారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌, చేవెళ్ల ఆర్డీవోలతో మాట్లాడతానని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధికార ప్రతినిధి భీంభారత్‌, ప్రతాప్‌రెడ్డి, బీజేపీ నాయకులు రాము, కిరణ్‌, మాణయ్య, బీఎస్పీ నాయకులు, భూనిర్వాసితులు ఆంజనేయులు, వేమారెడ్డి, అనంతం పాల్గొన్నారు.

వైభవంగా బీరప్ప బోనాలు

చేవెళ్ల: మల్లారెడ్డిగూడ గ్రామంలో రెండురోజుల పాటు బీరప్ప బోనాల ఉత్సవాలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసం, శివసత్తుల పునకాలు, ఒగ్గు కళాకారుల ఆట పాటలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల జడ్పీటీసీ ఎం.మాలతికృష్ణారెడ్డి ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎం.మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రాధిక వెంకటేశ్‌, జిల్లా సివిల్‌ సప్లయి కమిటీ సభ్యుడు రవీందర్‌, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎర్ర మల్లేష్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T23:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising