ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరీశ్‌కు వీడ్కోలు... ఆమోయ్‌కు స్వాగతం

ABN, First Publish Date - 2023-02-06T23:47:49+05:30

రంగారెడి జిల్లాకు బదిలీపై వెళ్లిన మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ వచ్చిన అమోయ్‌కుమార్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

కలెక్టర్లు అమోయ్‌కుమార్‌, హరీశ్‌లను గజమాలతో సత్కరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ కలెక్టరేట్‌లో ఇరువురి కలెక్టర్లకు సత్కారం

మేడ్చల్‌ అర్బన్‌, ఫిబ్రవరి 6: రంగారెడి జిల్లాకు బదిలీపై వెళ్లిన మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ వచ్చిన అమోయ్‌కుమార్‌కు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు, ఆహ్వానం కార్యక్రమంలో ఇద్దరు కలెక్టర్లు గజమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కమార్‌ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లడంలో హరీశ్‌ పాత్ర ఉందన్నారు. అన్ని రంగాలపై మంచి పట్టుందని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూశారని ప్రశంసించారు. అనంతరం డాక్టర్‌ ఎస్‌.హరీశ్‌ మాట్లాడుతూ జిల్లాలో పద్దెనిమిది నెలలపాటు బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ధరణి, జీవో 58, 59లో అధికారుల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. అమోయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా ప్రగతి మరింత వేగంగా జరుగుతుందని, ఆశక్తి అమోయ్‌కు ఉందన్నారు. ప్రతి ఒక్కరు బాఽధ్యతగా పనిచేసినప్పుడే లక్ష్యం చేరుకుంటామన్నారు. అనంతరం ఇరువురు కలెక్టర్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కీసరగుట్ట వేదపండితులు అశీర్వచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్‌ అగస్త్య, డీఆర్వో లింగ్యానాయక్‌, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, ట్రెస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు, ఆయాశాఖల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising