ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
ABN, First Publish Date - 2023-03-05T23:48:21+05:30
విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎ్‌సఎఫ్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ రూరల్, మార్చి 5 : విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎ్‌సఎఫ్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అనంతరం అతను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ఎయిర్‌పోర్టు అరైవల్‌లో బంగారం ఉన్న బ్యాగును మరో ఇద్దరి వ్యక్తులకు ఇచ్చాడు. అది గమనించిన సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో బ్యాగును తనిఖీ చేయగా లోపల ఇనుప బోల్ట్‌లో 600 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Updated Date - 2023-03-05T23:48:21+05:30 IST