గంగమ్మ ఒడికి గణపయ్యలు!
ABN, First Publish Date - 2023-09-22T22:29:33+05:30
విఘ్నాలను తొలగించే గణనాథులు ఐదోరోజు తాండూరు, ధారూరులో జయజయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అశేష భక్తజనావళితో విశేష పూజలందుకున్న లంబోదరుడు మళ్లొచ్చే ఏడాది వస్తానంటూ భక్తులకు వీడ్కోలు పలికాడు.
తాండూరులో ఘనంగా వినాయక నిమజ్జనం
భక్తుల కోలాహలం..ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్యే
బందోబస్తును పరిశీలించిన ఎస్పీ,
విఘ్నాలను తొలగించే గణనాథులు ఐదోరోజు తాండూరు, ధారూరులో జయజయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అశేష భక్తజనావళితో విశేష పూజలందుకున్న లంబోదరుడు మళ్లొచ్చే ఏడాది వస్తానంటూ భక్తులకు వీడ్కోలు పలికాడు. కోలాటాలు, మంగళహారతులతో నిమజ్జనోత్సవానికి బయల్దేరిన గణనాఽథులను మహిళలు వాడవాడలా ఎదురేగి సాగనంపారు. భారీ ఏర్పాట్ల మధ్య శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Updated Date - 2023-09-22T22:29:33+05:30 IST