ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ

ABN, First Publish Date - 2023-06-26T00:07:57+05:30

సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రం ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నిఖిల్‌ యాదవ్‌ మండిపడ్డారు.

సమావేశంలో మాట్లాడుతున్న నిఖిల్‌ ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమర్జెన్సీని తలపిస్తున్న బీఆర్‌ఎస్‌ పాలన

బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నిఖిల్‌ ఆనంద్‌

షాద్‌నగర్‌, జూన్‌ 25: సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రం ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నిఖిల్‌ యాదవ్‌ మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని చూస్తుంటే 1975 నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం షాద్‌నగర్‌ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌కు మించి సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు. ఎందరో ఆత్మబలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులు దోచుకు తింటున్నారని, ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో రూ. 50వేల కోట్లు దోచుకుతిన్నారని, దాన్ని రూ, 2లక్షల కోట్లకు పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించారని వెల్లడించారు. సంక్షేమ పథకాల వల్ల తెలంగాణలోని ఏయే వర్గాలు అభివృద్ధి చెందాయో సీఎం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వేధింపుల పర్వం కొనసాగుతుందని.. ప్రశ్నించే గొంతుకల మెడపై కత్తి పెట్టి అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన ఘనతను చాటుకోవడానికి దేశ వ్యాప్తంగా ఉన్న పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తూ రూ.వేలకోట్లు దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. అదికూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా రాసే పత్రికలకు మాత్రమే ప్రకటనలు జారీ చేస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై ప్రశ్నించే పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా తమ అక్కసును వెళ్లగకక్కుతున్నారని మండి పడ్డారు. పత్రికలకు ఇస్తున్న వందల కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లివచ్చిన ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకుడు కమలాకర్‌రెడ్డిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి దేపల్లి అశోక్‌గౌడ్‌, షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ విజయకుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, నాయకులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising