ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలి

ABN, First Publish Date - 2023-02-21T00:24:28+05:30

ప్రతీ పౌరుడు దేశాన్ని గౌరవిస్తూ అభివృద్ధికి పాటు పడాలని ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌) కమాండెంట్‌ విజయకుమార్‌వర్మ అన్నారు.

బొమ్మరాసిపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, ఆర్‌ఏఎఫ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, ఫిబ్రవరి 20: ప్రతీ పౌరుడు దేశాన్ని గౌరవిస్తూ అభివృద్ధికి పాటు పడాలని ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌) కమాండెంట్‌ విజయకుమార్‌వర్మ అన్నారు. సోమవారం శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో ఆర్‌ఏఎఫ్‌ హకీంపేట 99బటాలియన్‌ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్‌ గీతమహేందర్‌, కమాండెంట్‌ విజయకుమార్‌వర్మ, డిప్యూటీ కమాండెంట్‌ శ్రీకాంత్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ శశాంక్‌శేఖర్‌ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులు గ్రామంలో సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందిచుకోవాలని, దేశాభివృద్ధికి బాధ్యతగా పాటుపడాలని కమాండెంట్‌ అన్నారు. అనంతరం విద్యార్థులను పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే విద్యార్థులు వనదర్శినిని సందర్శించారు. అన్యదా ఫౌండేషన్‌ ఆర్గనైజర్లు ప్రసాద్‌, నస్రీన్‌, స్కవాన్‌, మనోజ్‌, వినయ్‌ ఆధ్వర్యంలో మజీద్‌పూర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు వనదర్శినిని సందర్శించారు. జంతువులపై ఫారెస్ట్‌ రేంజర్‌ విజయ్‌భాస్కర్‌, సెక్షన్‌ అధికారులు నాగేశ్వరావు, స్నేహశ్రీ వివరించారు.

Updated Date - 2023-02-21T00:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising