కాంగ్రె్‌స బలోపేతానికి కృషి చేయాలి
ABN, First Publish Date - 2023-07-13T00:53:48+05:30
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన గ్రామ కమిటీ కార్యవర్గం కృషి చేయాలని మండలాధ్యక్షుడు గూడ వీరేష్ అన్నారు.
కేశంపేట, జూలై 12: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన గ్రామ కమిటీ కార్యవర్గం కృషి చేయాలని మండలాధ్యక్షుడు గూడ వీరేష్ అన్నారు. బుధవారం కొండారెడ్డిపల్లి, కాకునూర్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాండారెడ్డిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడుగా తిప్పిశెట్టి సుదర్శన్, ఉపాధ్యక్షుడుగా వట్టెల లింగం, కాకునూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కోడూరు శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా కరోళ్ల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా దన్నె మల్లేష్, కార్య నిర్వహక కార్యదర్శిగా తైద శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివా్‌సలను ఎన్నుకున్నారు. వారికి ఆయన నియామక పత్రం అందించారు. కార్యక్రమంలో తుమ్మల గోపాల్ ముదిరాజ్, గిరిధర్ యాదవ్, భాస్కర్ గౌడ్, ఎం.డి, ఇబ్రహీం, రావుల పెంటయ్య, కోడూరు రాములు, కృష్ణా రెడ్డి, బాలాజీ, లింగం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-13T00:53:48+05:30 IST