ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యతోనే దేశ భవిష్యత్తు

ABN, First Publish Date - 2023-05-31T23:13:52+05:30

విద్యతోనే దేశ భవిష్యత్‌ అధారపడి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు.

మాట్లాడుతున్న సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నత లక్ష్యాలు గల విద్యార్థులతోనే దేశం విశ్వగురువుగా మారుతుంది

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ

పరిగి, మే 31: విద్యతోనే దేశ భవిష్యత్‌ అధారపడి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. వికారాబాద్‌జిల్లా పరిగిలోని ఇండస్‌ వ్యాల్యూ పాఠశాలలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అఽథితిగా పాల్గొని మాట్లాడారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థుల కృషేకాదు, వారి పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత చాలా పెద్దది అన్నారు. దేశంలో ఉన్నత లక్ష్యాలు గల విద్యార్థులు తయారయితే భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే ప్రాథమిక విద్య మూలాలే ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు సెల్‌ఫోన్‌లు, టీవీలకు దూరంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యలో డిగ్రీలు ప్రధానం కాదని, సమాజంలో పరివర్తన చెందే ఆంశాల పట్ల ప్రాథమిక దశ నుంచే నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి తనవంతుగా సహయసహకారాలు అందిస్తానని చెప్పారు. జిల్లాలోనే ఎక్కువగా పరిగిలో విద్యాసంస్థలు, రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు నెలకొల్పామని తెలిపారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్‌ పి.భాస్కరయోగి, బీజేపి జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణ, ఎంఈవో హరిశ్చందర్‌; పాఠశాల డైరెక్టర్‌ వీరేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising