ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
ABN, First Publish Date - 2023-09-23T00:20:20+05:30
మున్సిపల్ కేంద్రంలోని రుద్ర కాలనీలో నివాసముండే ఓ విద్యార్థి అదృశ్యమైంది. యువతి తల్లి శుక్రవారం రాత్రి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
ఆలస్యంగా వెలుగులోకి ..
శంషాబాద్, సెప్టెంబరు 22 : మున్సిపల్ కేంద్రంలోని రుద్ర కాలనీలో నివాసముండే ఓ విద్యార్థి అదృశ్యమైంది. యువతి తల్లి శుక్రవారం రాత్రి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ రుద్ర కాలనీలో నివాసముండే పులివర్తి రమాదేవి-రమేష్ దంపతుల కూతురు చందన పదో తరగతి చదువుతోంది. పక్కబస్తీ కాపుగడ్డలో ట్యూషన్‌కు కూడా వెళుతోంది. ఈ నెల 10న సాయంత్రం ట్యూషన్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ట్యూషన్ వద్దకు వెళ్లి అడిగితే.. ఇంటికి వెళ్లిందని చెప్పారు. ఇంటికి తిరిగివచ్చి చూస్తే అప్పటికీ రాలేదు. తానే వస్తుందిలే అనుకొని తల్లిదండ్రులు నిద్రకుపక్రమించారు. మరుసటి రోజు చుట్టుపక్కల ఇళ్లలో.. బంధువుల వద్ద వెతికినా జాడ తెలియరాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిస్తే ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం అందించాలని, కేసు దర్యాప్తు చేస్తునానమని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-09-23T00:20:20+05:30 IST