ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2023-08-02T22:43:27+05:30

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ క్రీడాప్రాంగణాలు, పంచాయతీ భవనాలు, మనఊరు-మనబడి, ఆయిల్‌పామ్‌, హరితహారం తదితర అంశాలపె ౖసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రీడాసామగ్రి కిట్లను క్రీడా ప్రాంగణాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల్లో గ్రామపంచాయతీ భవనాలకు స్థల సేకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఊరు- మనబడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ సాగును విస్తృత పరిచే దిశగా రైతులను ప్రోత్సహించి లక్ష్యం మేరకు రైతుల ఎంపిక, డీడీల సేకరణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యమిస్తూ పెద్ద సైజు మొక్కలను నాటాలని సూచించారు. వారం రోజుల తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలుఉంటాయని హెచ్చరించారు. సంక్షేమ శాఖల వసతి గృహాల్లో సదుపాయాల కల్పన, మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, డిప్యూటీ సీఈవో సుభాషిణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా విధి నిర్వహణలో పేదల ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ జిల్లాలో శిక్షణ ముగించుకొని వెళుతున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్టు రాహుల్‌ శర్మ, లింగ్యానాయక్‌, జిల్లా జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.

Updated Date - 2023-08-02T22:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising