అక్రమ నిర్మాణాల కూల్చివేత
ABN, First Publish Date - 2023-08-22T23:18:27+05:30
మండలంలోని ప్రతా్‌పసింగారం, కాచవానిసింగారం గ్రామాల్లో అక్రమనిర్మాణాలను మంగళవారం కూల్చివేశారు.
ఘట్‌కేసర్ రూరల్, ఆగస్టు 22: మండలంలోని ప్రతా్‌పసింగారం, కాచవానిసింగారం గ్రామాల్లో అక్రమనిర్మాణాలను మంగళవారం కూల్చివేశారు. ప్రతా్‌పసింగారం రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 52లోని మూడు, కాచవానిసింగారం రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 66లో మరో మూడు అక్రమ నిర్మాణాలను తహసీల్దారు కృష్ణ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దారు భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: కొండాపూర్ పరిధిలోని సర్వేనెంబర్ 153లో మూడు ఇళ్లను, ఘట్‌కేసర్ రెవెస్యూ పరిధిలోని సర్వేనెంబర్ 117లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన 10గుడిసెలను మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ ఆద్వర్యంలో రెవెన్యూ బృందం కూల్చివేతలు నిర్వహించారు. సర్వేనెంబర్ 117లో ఇప్పటికే పలు మార్లు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రస్తుతం కూల్చివేసిన స్థానంలో గుడిసెలు నిర్మించారు. విషయం తెలుసుకున్న అధికారులు గుడిసేలను సైతం ఎక్స్‌కావేటర్‌తో కూల్చివేశారు. బాధితులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే సహించేది లేదని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాస్కర్‌రెడ్డి, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T23:18:27+05:30 IST