ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

ABN, First Publish Date - 2023-01-26T00:09:27+05:30

ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయానికి బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. 8 నెలలకు సంబంధించి రూ.71,083 విద్యుత్‌ బిల్‌ చెల్లించాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 71,083 విద్యుత్‌ బకాయిలు

సరఫరాను నిలిపివేసిన విద్యుత్‌ శాఖ

రెండు గంటలు నిలిచిన సేవలు

ఆమనగల్లు, జనవరి25 : ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయానికి బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. 8 నెలలకు సంబంధించి రూ.71,083 విద్యుత్‌ బిల్‌ చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని నెలల తరబడి విద్యుత్‌శాఖ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయ అధికారులను కోరుతున్నా స్పందన లేదు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో విద్యుత్‌ ఏడీఈ శ్రీనివాస్‌ ఆదేశానుసారం ఏఈ సీతారామ్‌ సిబ్బందితో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో 2గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. రిజిస్ర్టేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. తహసీల్దార్‌ జ్యోతి విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం, వారం రోజుల్లో బిల్లు చెల్లిస్తామన్న అధికారుల హామీ మేరకు తిరిగి విద్యుత్‌ సరఫరా చేశారు.

Updated Date - 2023-01-26T00:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising