గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
ABN, First Publish Date - 2023-08-09T00:04:42+05:30
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని భారత గోసేవా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. దేశంలో గోవులు అన్యాక్రాంతమవుతున్నాయని, గతంలో 100కోట్ల గోవులుంటే ప్రస్తుతం 8కోట్లే అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. అ
షాద్‌నగర్, ఆగస్టు 8: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని భారత గోసేవా ఫౌండేషన్ డిమాండ్ చేసింది. దేశంలో గోవులు అన్యాక్రాంతమవుతున్నాయని, గతంలో 100కోట్ల గోవులుంటే ప్రస్తుతం 8కోట్లే అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. అఖిల భారత గో సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుమల దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం షాద్‌నగర్ పట్టణానికి చేరుకుంది. ఈ పాదయాత్రకు బీజేపీ, వీహెచ్‌పీ నేతలు స్వాతగం పలికారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ రాష్ట్ర నేత బండారి రమేష్ మాట్లాడుతూ కన్నతల్లి తర్వాత గోమాతనే ఈ సృష్టికి మాతృమూర్తి అని అభివర్ణించారు. పూర్వంలో 30వేల రకాల గోవులుంటే ప్రస్తుతం దేశంలో కేవలం 3వేల రకాలు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ గోమాత బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుడు అందె బాబయ్య మాట్లాడుతూ గోమాతలో ముక్కోటి దేవతలు దాగి ఉన్నారని, ప్రతి ఇంటిలో గోవును పెంచుకోవాలని సూచించారు. బీజేపీ నేత శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ పాదయాత్ర చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నేత చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-09T00:04:42+05:30 IST