ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోటాపోటీగా వినాయక లడ్డూల వేలం

ABN, First Publish Date - 2023-09-29T23:41:50+05:30

పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సూర్య యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమ్జనం గురువారం రాత్రి జరిగింది.

ఘట్‌కేసర్‌: అన్నోజిగూడలో వినాయకుడి లడ్డును యాదగిరికి అందజేస్తున్న నిర్వాహకులు

ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 29: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సూర్య యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమ్జనం గురువారం రాత్రి జరిగింది. ఈసందర్బంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో అన్నోజిగూడకు చెందిర రాదారం యాదగిరి రూ.2.17లక్షలకు లడ్డును దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, నాయకులు నల్లవెల్లి శేఖర్‌, నర్సింహ, సత్తిరెడ్డి, కెఎంరెడ్డి, శంకర్‌, భాస్కర్‌, జితేందర్‌, రాజేశ్వర్‌రెడ్డి, లోకేష్‌, విక్రమ్‌, దర్శన్‌, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దోమ: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిమజ్జనం సందర్భంగా వినాయక లడ్డును గంజిపల్లి బాయిమీది తండాలో రాథోడ్‌ గోపి రూ.40,500కు దక్కించుకున్నాడు.

బంట్వారం(కోట్‌పల్లి): రాంపూర్‌లో హనుమాన్‌ ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం వినాయకుడి లడ్డు వేలం నిర్వహించారు. గ్రామానికి కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి రూ.లక్ష 15వేలకు లడ్డును కైవసం చేసుకున్నారు.

గణనాథుడికి ప్రత్యేకపూజలు

బొంరా్‌సపేట్‌: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు నిత్య పూజలందుకున్న గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్ఞనానికి తరలించారు. బొంరా్‌సపేట్‌ మండల కేంద్రంలో ప్రతిష్టించిన గణనాథులను భక్తులు పూజలు నిర్వహించి కోలాటం, భజనలు, నృత్యాలతో గ్రామంలోని పురవీదుల మీదుగా ఊరేగింపు చేశారు.

మేడ్చల్‌ టౌన్‌: అత్వెల్లిలో రైసింగ్‌ స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి శుక్రవారం 108 రకాల ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-09-29T23:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising