కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-02-21T00:37:39+05:30
అనారోగ్య సమస్య భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పరిగి, ఫిబ్రవరి 20: అనారోగ్య సమస్య భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్‌పల్లికి చెందిన కోట్ల మైపాల్‌రెడ్డి(51) కొంతకాలం కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని అస్పత్రులు తిరిగినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Updated Date - 2023-02-21T00:37:40+05:30 IST