ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్‌ నాకే

ABN, First Publish Date - 2023-06-18T23:39:03+05:30

వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, సీంఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తనకు ఎల్లవేళలా ఉంటుందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లెపల్లెకు రత్నం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం

చేవెళ్ల, జూన్‌ 18 : వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, సీంఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తనకు ఎల్లవేళలా ఉంటుందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దేవునిఎర్రవల్లి, రేగడిఘనాపూర్‌ తదితర గ్రామాల్లో పల్లెపల్లెకు రత్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్‌ఎస్‌ చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందని స్పష్టం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి నాటి నుంచి నేటి వరకు చేవెళ్ల గడ్డపై స్వచ్ఛమైన రాజకీయ పాలన అందించామన్నారు. ఎక్కడ కూడా ఇంచు స్థలం కబ్జా చేయలేదన్నారు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందించడం జరిగిందన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయంగా జీర్ణించుకోలేకనే పార్టీలు మారుతున్నాడని చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు. నా చరిత్ర చేవెళ్ల ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. తన రాజకీయ గురువు దివంగత ఇంద్రారెడ్డి అని చెప్పారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చేవెళ్ల గడ్డపై ప్రజలకు ప్రజాసేవ చేస్తానన్నారు. మాజీ సర్పంచ్‌లు రాంచంద్రయ్యగౌడ్‌, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, సీనియర్‌ నాయకులు మాణిక్యరెడ్డి, రవీందర్‌, రఘువీర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌, హన్మంతు, లింగం, సుదర్శన్‌, శేఖర్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-18T23:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising