కారులో మంటలు
ABN, First Publish Date - 2023-03-02T23:43:27+05:30
ప్రయాణిస్తున్న కారులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటల చెలరేగిన ఘటన షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
షాద్‌నగర్ రూరల్, మార్చి 2 : ప్రయాణిస్తున్న కారులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటల చెలరేగిన ఘటన షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్(27) హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. గురువారం మహబూబ్‌నగర్‌లో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో కుటుంబసభ్యులతో కలిసి షిఫ్ట్ కారులో వెళుతున్నాడు. ఈక్రమంలో షాద్‌నగర్ పట్టణ శివారులోని చర్చి సమీపంలోకి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై బయటికి దిగారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అయితే, కారు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. కారులో మంటలు చెలరేగిన సమయంలో నవీన్‌తో పాటు మరో ఐదుగురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Updated Date - 2023-03-02T23:43:27+05:30 IST