తిరుపతి-శ్రీశైలం దైవ క్షేత్రాలకు బస్సు సర్వీసు
ABN, First Publish Date - 2023-02-11T00:26:52+05:30
శివరాత్రి సందర్భంగా ఈ నెల 12 నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపిస్తామని ఆర్టీసీ పరిగి డీఎం జీఎన్ పవిత్ర తెలిపారు.
పరిగి, ఫిబ్రవరి 10: శివరాత్రి సందర్భంగా ఈ నెల 12 నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపిస్తామని ఆర్టీసీ పరిగి డీఎం జీఎన్ పవిత్ర తెలిపారు. అలాగే ప్రతీ నెల 6న తిరుమల-తిరుపతికి బస్సు నడిపిస్తామని తెలిపారు. తిరుపతి వెళ్లే భక్తులు ప్రతీ నెల 20లోపు 7382839193, 7382838342, 9959225253 నెంబర్లను సంప్రదించి సీట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అలాగే పెళ్ళిళ్ల సీజన్‌లో భాగంగా బస్సుల అద్దెపై పదిశాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. జూన్ 30 వరకు రాయితీలు వర్తిస్తాయని చెప్పారు.
Updated Date - 2023-02-11T00:26:53+05:30 IST