తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరం
ABN, First Publish Date - 2023-08-02T00:21:31+05:30
తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని ఇబ్రహీంపట్నం సీడీపీవో జి.శాంతిశ్రీ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని 6వ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్ట్టు 1: తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని ఇబ్రహీంపట్నం సీడీపీవో జి.శాంతిశ్రీ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని 6వ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆగస్టు ఒకటి నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పని ప్రదేశాల్లో కూడా తల్లిపాలు ఇచ్చేవిధంగా వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు. నవజాత శిశువుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు తల్లిపాలలో ఉంటాయని, పిల్లలకు అలర్జీ, జబ్బులు, ఊబకాయం రాకుండా తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. మధుమేహం, కాన్సర్‌ల బారినుంచి పిల్లలను తల్లిపాలే కాపాడతాయని ఆమె చెప్పారు. ఇన్ఫెక్షన్లు తగ్గించే గుణం కూడా తల్లిపాలలో ఉంటుందన్నారు. సరైన వయస్సుకు తగిన బరువు తల్లిపాల వల్లే సాధ్యమని సీడీపీవో తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పల్లవి, టీచర్లు పద్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:21:31+05:30 IST