ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోనాల జాతర

ABN, First Publish Date - 2023-08-27T23:22:40+05:30

శ్రావణమాసం సందర్భంగ గడి మైసమ్మ బోనాల జాతరను ఆదివారం మేడ్చల్‌లో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం బోనాలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

బోనాల జాతర

మేడ్చల్‌టౌన్‌/కీసర ఆగస్టు 27: శ్రావణమాసం సందర్భంగ గడి మైసమ్మ బోనాల జాతరను ఆదివారం మేడ్చల్‌లో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం బోనాలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యువజన సంఘాలు, రాజకీయ నాయకులు, కులసంఘాలు, కౌన్సిలర్లు ఫలహార బండ్లను ఊరేగింపు నిర్వహించి అమ్మ వారికి సమర్పించారు. పోలీసులు పెద్ద ఎత్తున బందో బస్తును ఏర్పాటు చేశారు. కాగా బోనాల ఉత్సవాల్లో భాగంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, టీపీసీసీ నాయకులు వజ్రేష్‌ యాదవ్‌, బీజేపీ నేతలు అమ్మ వారిని దర్శించుకుకున్నారు.

గ్రామదేవత ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

కీసర మండల పరిధి యాద్గార్‌పల్లి గ్రామంలో గ్రామదేవత ఆలయ నిర్మాణానికి కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన సొంత నిధులతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో ఆలయాలు, మసీదులు,ఈద్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-27T23:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising