భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2023-05-02T23:29:22+05:30
ఈ నెల 13న షాబాద్ మండలానికి వస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.
షాబాద్, మే 2 : ఈ నెల 13న షాబాద్ మండలానికి వస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆస్పల్లిగూడ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని తొమ్మిదిన్నరేళ్లవుతున్నా దాని ఊసే లేదన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ర్టాన్ని దోచుకుతింటున్నారన్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ హామీలను నెరవేర్చని సీఎంకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చేందుకు ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కు గ్యాస్, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని, ధరణి పోర్టల్ తొలగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి పామెన భీంభరత్, సీనియర్ నాయకులు సున్నపు వసంతం, షాబాద్ దర్శన్, పార్టీ షాబాద్ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, డీసీసీ ఉపాధ్యక్షుడు కుమ్మరి చెన్నయ్య, పామెన భార్గవ్‌రాం, పెంటారెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ఉదయ్‌మోహన్‌రెడ్డి, రాంరెడ్డి, దేశమోళ్ల ఆంజనేయులు, చేవెళ్ల స్వామి, వెంకట్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, అశ్విని పాల్గొన్నారు.
Updated Date - 2023-05-02T23:29:22+05:30 IST