భగీరథుడు.. సమాజానికి ఆదర్శం
ABN, First Publish Date - 2023-04-28T00:04:13+05:30
తన తపస్సుతో గంగను భూమికి తీసుకువచ్చిన మహర్షి భగీరథుడని, ఆయన నేటి సమాజానికి ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు.
రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : తన తపస్సుతో గంగను భూమికి తీసుకువచ్చిన మహర్షి భగీరథుడని, ఆయన నేటి సమాజానికి ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ సమాజ హితం కోసం నాడు భగీరథుడు అవిశ్రాంతంగా కృషి చేసి.. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రమీల, బీసీ సంక్షేమాధికారి ఉదయ్ ప్రకాశ్, వార్డెన్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-28T00:04:13+05:30 IST