ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

ABN, First Publish Date - 2023-06-06T23:01:07+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పెద్దేముల్‌ మండల విద్యాధికారి వెంకటయ్య అన్నారు.

కీసర: బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దేముల్‌, జూన్‌ 6: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పెద్దేముల్‌ మండల విద్యాధికారి వెంకటయ్య అన్నారు. బడిబాట సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి మండలంలోని రేగొండి, కొండాపూర్‌ గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌, కొండాపూర్‌, రేగొండి పాఠశాలల హెచ్‌ఎం సంతోష్‌, పులిందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు మహేష్‌, సలీం, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, గొడుగురాజు తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్‌ రూరల్‌: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని పాత కొడంగల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఇల్లూరి క్రాంతికుమార్‌ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాత కొడంగల్‌లో ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సంధ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పాల్గొన్నారు.

కీసర: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కీసర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటేష్‌ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కీసర గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

దోమ: విద్యాభివృద్ధితోనే గ్రామం, దేశం అభివృద్ధి చెందుతుందని దోమ ఎంఈవో హరిచంద్ర అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రమేశ్‌, ఉపాధ్యాయులు వెంకటేశ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ హరిబాబు, వైస్‌ చైర్మన్‌ అంజిబాబు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు.

Updated Date - 2023-06-06T23:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising