ఆటో-బైక్ ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
ABN, First Publish Date - 2023-09-23T00:21:31+05:30
ఆటో-బైక్ ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని కాటన్‌మిల్ ఎదుట ముర్తోజుపల్లి గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆమనగల్లు, సెప్టెంబరు 22 : ఆటో-బైక్ ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని కాటన్‌మిల్ ఎదుట ముర్తోజుపల్లి గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం ఆమనగల్లు మున్సిపాలిటీ పెంట తండాకు చెందిన ఇస్లావత్ భరత్, రంజిత్, విఠాయిపల్లికి చెందిన మల్లే్‌షలు రంజిత్‌కు చికిత్స నిమిత్తం బైక్‌పై ఆమనగల్లు పట్టణానికి వెళ్ళి తిరిగి స్వస్థలాలకు వెళ్తున్నారు. తిరుగు ప్రయాణంలో కాటన్‌మిల్ వద్ద బస్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా ఆమనగల్లు వైపు వెళ్తున్న ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆటో, బైక్ బోల్తాపడి నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదంలో బైక్‌పై ఉన్న భరత్, రంజిత్, మల్లే్‌షతో పాటు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికి త్స అనంతరం భరత్‌ను వెల్డండ సమీపంలోని ఎన్నం ఆసుపత్రికి, మల్లేష్, రంజిత్, ఆటో డ్రైవర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ బాల్‌రాంనాయక్ సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-09-23T00:21:31+05:30 IST