పేదలకు అండగా ‘ఆర్ట్ ఫౌండేషన్’
ABN, First Publish Date - 2023-03-11T23:42:18+05:30
పేద ప్రజలకు ఆర్ట్ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి అన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా హరినాథ్‌రెడ్డి
మహేశ్వరం, మార్చి 11 : పేద ప్రజలకు ఆర్ట్ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అమీర్‌పేట గ్రామంలో శనివారం ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అనితారెడ్డి స్వయంగా వైద్యపరీక్షలు చేశారు. అవసరమున్నవారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాసేవలో ఉన్నంత ఆనందం.. మరెక్కడా ఉండదని, పేద ప్రజలకు సేవ చేయాలంటే.. రాజకీయ పదవులే కాకుండా.. మంచి మనస్సు, మానవత్వం ఉండాలని అన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా పేదలకు తోచిన సహాయసహకారాలు అందించేందుకు ఆర్ట్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. సర్పంచ్ బస్వ శ్రీశైలంగౌడ్, ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-11T23:42:18+05:30 IST