ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

ABN, First Publish Date - 2023-01-26T00:02:08+05:30

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆలేడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌ రూరల్‌, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆలేడ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కొడంగల్‌ ఎస్సై రవిగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు... ఆలేడ్‌ గ్రామానికి చెందిన బడుసు వెంకటేశ్‌(24) నాలుగేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం హర్యానాలో విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల్లో ఈ నెల 9న స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి తన కారు సర్వీసింగ్‌ చేయించేందుకు స్నేహితులు శ్రీనివా్‌సరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి తాండూర్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆలేడ్‌ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బడుసు వెంకటేశ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, స్నేహితులకు గాయాలయ్యాయి. వెంకటేశ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి చంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వాహనం బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి

దౌల్తాబాద్‌, జనవరి 25: బొలేరో వాహనం బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దౌల్తాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్‌ ఏఎస్సై మూతరాజ్‌ తెలిపిన వివరాల మేరకు... దౌల్తాబాద్‌ మండలం చల్లాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బొలేరో(ట్రాలీ) వాహనంలో బుధవారం కర్ణాటక రాష్ట్రం మోత్కుపల్లికి బయలుదేరారు. ఈక్రమంలో దౌల్తాబాద్‌ గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో వాహనంలో ఉన్న రెడ్డి రాజు(27) అక్కడికక్కడే మృతిచెందాడు. అదేవిధంగా బుద్యప్ప అనే వ్యక్తికి కాలు విరగడంతో పోలీసులు చికిత్స నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-26T00:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising