ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

ABN, First Publish Date - 2023-09-22T00:09:06+05:30

హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ రెడ్డి

ఆమనగల్లు, సెప్టెంబరు 21 : హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రమాదాలు జరిగే డేంజర్‌ జోన్‌లను గుర్తించి ఆయా చోట్ల తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆమనగల్లు పట్టణంలో గురువారం ఏసీపీ పర్యటించారు. స్థానిక ఎస్‌ఐ బాల్‌రామ్‌ నాయక్‌, షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రవీంద్రనాయక్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారి గంగాధర్‌లతో కలిసి ఇటీవల కాటన్‌ మిల్‌ ఎదుట హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ప్రమాదాలకు గల కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఆయా చోట్ల ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని కోరారు. కార్యక్రమంలో కాటన్‌ మిల్‌ అధ్యక్షుడు నారాయణ, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-09-22T00:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising