‘సివిల్ సర్వీసెస్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ABN, First Publish Date - 2023-08-02T00:20:53+05:30
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి మైనారిటీ శాఖ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి కె. నవీన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 1 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి మైనారిటీ శాఖ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి కె. నవీన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఠీఠీఠీ.ఛ్ఛ్టి.ఛిజజ.జౌఠి.జీుఽ/్టఝట్ఛట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 20న స్ర్కీనింగ్ టెస్ట్ ఉంటుందని, విద్యార్హతలు, ఎంపిక విధానం, తదితర విషయాలు వెబ్‌సైట్ పొందుపర్చినట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 040-23236112 ఫోన్‌లో సంప్రదించాలని తెలిపారు.
Updated Date - 2023-08-02T00:20:53+05:30 IST