ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టురట్టు

ABN, First Publish Date - 2023-02-21T23:46:17+05:30

ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులను గుట్టు రట్టు చేశారు.

పోలీసులు దాడులు జరిపిన ఫాంహౌజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొత్తూర్‌లో ఫాంహౌజ్‌పై దాడులు ఫ ఐదుగురు విటులు అరెస్ట్‌

కొత్తూర్‌, ఫిబ్రవరి 21: ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులను గుట్టు రట్టు చేశారు. మండల కేంద్రంలోని పెద్దమ్మతండా రోడ్డులో వింటేజ్‌ క్లాసిక్‌ వెంచర్‌లోని ఓఫాంహౌజ్‌పై స్థానిక పోలీసులు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ)పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించినట్లు స్థానిక సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలంలోని సుభాన్‌పూర్‌కు చెందిన శ్రీకాంత్‌, పెద్దమ్మతండాకు చెందిన రాజు, చిన్పతుప్పరకు చెందిన నాగరాజు, మన్‌సాన్‌పల్లికి చెందిన నవీన్‌, నల్లచెరువుతండాకు చెందిన రవి అనే యువకులు హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ వ్యభిచారం నడుతుపుతున్న నిర్వాహకుల ద్వారా వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ఓ యువతిని బుక్‌ చేసుకున్నారు. ఆ యువతిని కొత్తూర్‌లోని వింటేజ్‌ క్లాసిక్‌ వెంచర్‌లోని ఫాంహౌజ్‌కు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు. ఫాంహౌ్‌సలో ఐదుగురు విటులతో పాటు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కండోమ్‌ ప్యాకెట్లు, మూడు కార్లు, 9సెల్‌ఫోన్లు, 16వేల నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకుని ఫౌంహౌజ్‌ను సీజ్‌ చేశారు. విటులను అరె్‌స్టచేసి కోర్టుకు, యువతిని ప్రజ్వల హోంకు తరలించారు. ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వహకులపై కేసులు నమోదు చేశామని, వారిని త్వరలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తామని సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు.

Updated Date - 2023-02-21T23:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising