కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం.. ఒకరి అరెస్టు
ABN, First Publish Date - 2023-02-18T00:13:47+05:30
కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 175 డబ్బాలను(ఒక్కొక్కటి 180 గ్రాములు) స్వాధీనం చేసుకున్నట్లు ధారూరు సీఐ అప్పయ్య తెలిపారు.
బంట్వారం (కోట్‌పల్లి), ఫిబ్రవరి 17 : కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 175 డబ్బాలను(ఒక్కొక్కటి 180 గ్రాములు) స్వాధీనం చేసుకున్నట్లు ధారూరు సీఐ అప్పయ్య తెలిపారు. శుక్రవారం కోట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోట్‌పల్లి మండల కేంద్రంలోని సంగమేశ్వర కిరాణా షాపు, తవక్కల్ దుకాణానికి సంగారెడ్డి జిల్లా కంది మండలం జుక్కల్ గ్రామానికి చెందిన వసీం నగర శివారులోని ఓ ఫ్యాక్టరీ నుంచి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ మేరకు వసీం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Updated Date - 2023-02-18T00:13:48+05:30 IST