ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దూరవిద్య కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం

ABN, First Publish Date - 2023-09-21T23:24:30+05:30

దూరవిద్య కోర్సులో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఉస్మానియా విశ్వ విద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వీబీ నర్సింహా, అశోక్‌ కుమార్‌ తెలిపారు.

వికారాబాద్‌: పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నర్సింహా, అశోక్‌ కుమార్‌

వికారాబాద్‌, సెప్టెంబరు 21: దూరవిద్య కోర్సులో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఉస్మానియా విశ్వ విద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వీబీ నర్సింహా, అశోక్‌ కుమార్‌ తెలిపారు. వికారాబాద్‌ ఎస్‌ఏపీ కళాశాలలో గురువారం అడ్మిషన్ల పోస్టర్‌ విడుదల చేసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వ విద్యాలయం 72కోర్సులకు అనుమతులు పొంది దేశంలో అత్యధిక సంఖ్యలో దూర విద్యా కోర్సులను అందిస్తోందని తెలిపారు. యూజీసీ ఆదేశాల ప్రకారం దూరవిద్య ద్వారా పొందే డిగ్రీలు రెగ్యులర్‌ డిగ్రీలతో అన్ని ప్రయోజనాలకు సమానమన్నారు. అదేవిధంగా ఒక కోర్సును రెగ్యులర్‌గా చదువుతూ, అదే సమయంలో ఒక దూరవిద్య కోర్సును చదవడానికి యూజీసీ, ఓయూలు అవకాశాలు 2023-24 నుంచి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జూలై- సెప్టెంబరు విడతకు ప్రవేశాలు ప్రారంభించినట్లు తెలిపారు. దరఖాస్తులకు సెప్టెంబర్‌ 30వరకు గడువు ఉందని, ఇతర వివరాలకు 8886111690, ఓయూసీడీఈ, ఎన్‌ఈటీ లేదా, ఓఎ్‌సఎంఏఎన్‌ఐఏ.ఏసీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఏపీ కళాశాల ప్రిన్సిపల్‌ మందారిక, కోఆర్డినేటర్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

దూరవిద్య డిగ్రీలు రెగ్యులర్‌ డిగ్రీలతో సమానం

తాండూరు: యూజీసీ ఆదేశాల మేరకు దూర విద్య ద్వారా పొందే డిగ్రీలు రెగ్యులర్‌ డిగ్రీలతో సమానమని ప్రొఫెసర్‌ రామ్‌రెడ్డి, దూరవిద్య కేంద్రం జాయింట్‌ డైరెక్టర్లు ప్రొఫెసర్‌ నరసింహ, ప్రొఫెసర్‌ అశ్వక్‌కుమార్‌ తెలిపారు. తాండూరులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌, దూరవిద్య అధికార సంస్థ ద్వారా మొత్తం 72 కోర్సులకు అనుమతి పొందినట్లు తెలిపారు. తెలిపారు. అడ్వాన్స్‌ డిప్లమో కోర్సులు, యోగాలో సర్టిఫికేట్‌ కోర్సులు నాణ్యమైన విలువలతో తక్కువ రుసుముతో అందిస్తున్నామని చెప్పారు. పీజీ కోర్సుతో పాటు ఈ ఏడాది నుంచి సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2023-09-21T23:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising