ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమ నిర్మాణాలపై చర్యలు

ABN, First Publish Date - 2023-09-22T22:34:52+05:30

అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టారు. వాటికి చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగారు. సర్కార్‌ ఆదేశాలు గాలికి శీర్షికతో ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రచురించిన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు.

సెల్లార్‌ను మూసివేసిన అధికారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌.....

శంకర్‌పల్లి సెప్టెంబరు 22 : అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టారు. వాటికి చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగారు. సర్కార్‌ ఆదేశాలు గాలికి శీర్షికతో ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రచురించిన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను మూసి వేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కట్టడాలు చేపట్టాలని, గృహ యజమానులు తప్పనిసరిగా సెప్టిక్‌ ట్యాంక్‌, వాహనాలు నిలపడానికి పార్కింగ్‌ వదలాలని మున్సిపల్‌ కమిషనర్‌ హెచ్చరించారు. అయితే, కొందరు పెద్దలు అధికారులపై ఒత్తిడి తెస్తూ కొంతమంది పలుకుబడి కలిగిన వారి నిర్మాణాల జోలికి వెళ్లవద్దంటూ హుకూం జారీ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో సామాన్యుల నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటున్నారని, మున్సిపాలిటీ ఎదురుగా, సంగారెడ్డి, చేవెళ్ల, హైదరాబాద్‌ రోడ్డు ప్రాంతాల్లో అనేక నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా వాటి జోలికి పోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలన్నింటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-09-22T22:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising