ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రియాయోగం ఉత్తమ మార్గం

ABN, First Publish Date - 2023-02-16T23:10:54+05:30

నేటి తరానికి క్రియా యోగసాధన మాత్రమే అత్యుత్తమ మార్గం అని స్వామీ చిదానంద ఉద్బోధించారు.

ప్రసంగిస్తున్న స్వామి చిదానంద గిరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వామి చిదానంద గిరి ఉద్బోధ

కన్హా శాంతి వనంలో ముగిసినఆధ్యాత్మిక సంగమ కార్యక్రమం

షాద్‌నగర్‌, ఫిబ్రవరి 16: నేటి తరానికి క్రియా యోగసాధన మాత్రమే అత్యుత్తమ మార్గం అని స్వామీ చిదానంద ఉద్బోధించారు. నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో ఐదు రోజులుగా యోగధ సత్సంగ సొసైటీ, సెల్ఫ్‌ రియలైజేషన్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సంగమం ముగింపు కార్యక్రమంలో గురువారం ఆయన ప్రసంగించారు. చిదానంద గిరి మాట్లాడుతూ.. మనుషులు తర్కంతో అజ్ఞానంలో కూరుకుపోతున్నామని, తర్క మాయ నుంచి బయటపడేందుకు క్రియా యోగం ఉత్తమ మార్గం అన్నారు. నిరంతరం దైవ ధ్యాసలో ఉండాలని, ప్రతీ ఒక్కరు నిద్రించే ముందు భగవంతుడిని ధ్యానించాలన్నారు. ఉదయం సూర్య నమస్కారంతో జీవన శైలిని ప్రారంభించాలన్నారు. క్రీయా యోగంతో మనుషులు అత్యున్నతంగా ప్రక్షాళన గావిస్తారన్నారు. దీంతో మెదడు, గుండె, నాడీ మండల వ్యవస్థ బాగా పనిచేస్తాయన్నారు. క్రియాయోగ గురువుల బోధనలతో ఆత్మ సాక్షాత్కారం, శాంతి, జ్ఞానం లభిస్తాయన్నారు.

Updated Date - 2023-02-16T23:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising