ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు

ABN, First Publish Date - 2023-05-31T23:54:27+05:30

ధారూరులో పునర్‌ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆయంలో దేవతామూర్తుల విగ్రహాల పత్రిష్ఠాపన పూజలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ధారూరులో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాపన పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు, మే 31: ధారూరులో పునర్‌ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆయంలో దేవతామూర్తుల విగ్రహాల పత్రిష్ఠాపన పూజలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయకుడు, సీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి, బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన తదితర పూజలను రుత్విక్కులు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహవచనం, రుత్విక్‌ వర్ణం, జలాధివాసం, ధాన్యాదివాసం, వస్రాదివాసము, పుష్పాదివాసము తదితర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నాందర్‌పూర్‌లో బొడ్రాయి పత్రిష్ఠాపన

బొంరా్‌సపేట్‌: నాందర్‌పూర్‌లో ఆయిదాలపల్లి అభయాంజనేయస్వామి విగ్రహ, బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలను నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోదరుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఎ.తిరుపతిరెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. నిర్వాహ కులు ఆయనను శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్‌ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఊరడమ్మ, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన

నవాబుపేట:పూలపల్లి గ్రామంలో ఊరడమ్మ విగ్రహ, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2023-05-31T23:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising