పేదల బాగోగులు పట్టించుకోని ప్రధాని
ABN, First Publish Date - 2023-03-05T00:18:17+05:30
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన స్నేహితుడైన అదానీ ప్రయోజనం కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థల రూ.లక్షల కోట్లతో అదాని సంస్థల షేర్లను కొనిపించి ఆయా పబ్లిక్ రంగ సంస్థలను నష్ట పరిచారని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు.
ఆమనగల్లు, మార్చి4: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన స్నేహితుడైన అదానీ ప్రయోజనం కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థల రూ.లక్షల కోట్లతో అదాని సంస్థల షేర్లను కొనిపించి ఆయా పబ్లిక్ రంగ సంస్థలను నష్ట పరిచారని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఆమనగల్లు లో శనివారం పీసీసీ సభ్యుడు ఐళ్ల శ్రీనివా్‌సగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి నెనావత్ బిక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడునర్సింహలతో కలిసి వంశీచంద్ విలేకరులతో మాట్లాడారు. ఒక వ్యక్తి కోసం ప్రధాని మోదీ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. మోదీ దేశ ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యంగా పాలన సాగిస్తున్నారని మం డిపడ్డారు. 6వ తేదీ నుంచి 12వరకు ప్రతి బ్లాక్ పరిధిలో ఎస్‌ఐసీ కార్యాలయాలు, ఎస్‌బీఐ బ్రాంచిల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 6న ఆమన గల్లులోని ఎస్బీఐ వద్ద నిరసన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా వంశీచంద్ కోరారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి మిట్టపల్లి అంజయ్యగుప్తా, కడ్తాల, తలకొండపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బిచ్యానాయక్, డోకూరు ప్రభాకర్ రెడ్డి, కడ్తాల కో-ఆప్షన్ మెంబర్ జహంగీర్‌బాబ, సర్పంచ్‌లు సేవ్య, శ్రీశైలం, నాయకుడు అజీం పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:18:17+05:30 IST