ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-08-22T23:17:13+05:30

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన జీనోమ్‌ వ్యాలీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

మూడుచింతలపల్లి, ఆగస్టు 22: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన జీనోమ్‌ వ్యాలీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సిద్ధిపేట్‌ జిల్లా మర్‌కూక్‌ మండలం వరదరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన సంపత్‌కుమార్‌(36) తుర్కపల్లిలోని యూజియ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూలాగే విధుల్లో భాగంగా బైక్‌పై తుర్కపల్లిలోని యూజియ కంపెనీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొల్తుర్‌ నుంచి పోతారం వైపు వెళ్తున్న కంపెనీ బస్సును డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంపత్‌ తల, ఛాతి భాగంలో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ బస్సు ముందు భాగంలో ఇరుక్కోగా బస్సు వంద మీటర్ల వరకు దూసుకెళ్లింది. దీంతో ద్విచక్రవాహన పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి మంటలు చెలరేగి బస్సుతో పాటు బైక్‌ దగ్ధమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-08-22T23:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising