‘భాష్యం’లో ఘనంగా వీడ్కోలు వేడుక
ABN, First Publish Date - 2023-03-10T23:33:21+05:30
తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో శుక్రవారం వీడ్కోలు వేడుకను విజయీభవ-2023 పేరుతో పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
తాండూరు, మార్చి 10: తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో శుక్రవారం వీడ్కోలు వేడుకను విజయీభవ-2023 పేరుతో పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరుచుకుని ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. అనంతరం 18ఏళ్లుగా సుమారు 25వేల మందికి ఉచిత కంటి చికిత్సలు చేయించిన బసవ ఆఫ్టికల్స్ నాగరాజును కళాశాల బృందం సత్కరించింది. అంతకుముందు ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రీబాయి పూలే వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి, కళాశాల డైరెక్టర్ అజిత్‌షిండే, అధ్యాపకులు వెంకట్‌రెడ్డి, మల్లికార్జున్, శాంతయ్య, శ్రీనివాస్, భాను, శ్రీనివాస్, మధురిమ, పూర్ణిమ, శృతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Updated Date - 2023-03-10T23:33:21+05:30 IST