పోలీసులమని చెప్పి బంగారు ఉంగరం అపహరణ
ABN, First Publish Date - 2023-01-18T00:03:45+05:30
తాము పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరాన్ని అపహరించిన సంఘటన వికారాబాద్‌లో జరిగింది.
వికారాబాద్, జనవరి 17: తాము పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరాన్ని అపహరించిన సంఘటన వికారాబాద్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పార్వతయ్యస్వామి అనే వ్యక్తి మంగళవారం పట్టణంలో పూలు కొని వెళుతుండగా, ఇద్దరు ముఖానికి మాస్కులు ధరించి బైక్‌పై వచ్చారు. పార్వతయ్య వద్దకు వచ్చి తాము పోలీసులమని ఒంటిపై బంగారు వస్తువులుంటే చోరీ చేస్తారని, బంగారు ఆభరణాలు పెట్టుకోవద్దంటూ చెప్పారు. పార్వతయ్య చేతికున్న ఉంగరాన్ని తీసుకొని పేపర్‌లో చుట్టి అతడి బ్యాగులో పెట్టే క్రమంలో దృష్టి మరల్చి రాళ్లను పేపర్‌లో చుట్టి బ్యాగ్‌లో పెట్టి ఉంగరాన్ని కాజేసి పారిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అనుమానం వచ్చిన పార్వతయ్య ప్యాకెట్‌ను పరిశీలించగా, అందులో రాయి ఉంది. దీంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఇటువంటి దొంగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసులమని చెబితే గుర్తింపు కార్డు చూపాలని అడగాలన్నారు. అనుమానం వస్తే పోలీసులకు సమాచారమివ్వాలని తెలిపారు.
Updated Date - 2023-01-18T00:03:46+05:30 IST