పుస్తెలతాడు అపహరణకు విఫలయత్నం
ABN, First Publish Date - 2023-06-26T00:14:56+05:30
మహిళ మెడలోనుంచి పుస్తెలతాడు అపహరించేందుకు యత్నించిన ఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శంకర్‌పల్లి, జూన్ 25 : మహిళ మెడలోనుంచి పుస్తెలతాడు అపహరించేందుకు యత్నించిన ఘటన శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొనాపూర్‌కు చెందిన సునంద ఆదివారం శంకర్‌పల్లి సంతకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుండగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కంసాన్‌పల్లికి చెందిన రవీందర్(27)శివ(24)లు బైక్‌పై వచ్చి సునంద మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పోయేందుకు యత్నించారు. గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. రవీందర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శివ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద గల పుస్తెలతాడును బాధితురాలికి అప్పగించారు. సునంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Updated Date - 2023-06-26T00:14:56+05:30 IST