ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వర్టుకు అడ్డంగా కాంక్రీట్‌ గోడ

ABN, First Publish Date - 2023-03-12T23:24:24+05:30

ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ శివారులో పాత జాతీయ రహదారి పక్కన కల్వర్టుకు అడ్డంగా కాంక్రీట్‌ గోడను నిర్మిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆరోపించారు.

కాంక్రీట్‌ గోడను పరిశీలిస్తున్న బక్కని నర్సింహులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తహసీల్దారుకు బక్కని నర్సింహులు ఫిర్యాదు

షాద్‌నగర్‌రూరల్‌, మార్చి12: ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ శివారులో పాత జాతీయ రహదారి పక్కన కల్వర్టుకు అడ్డంగా కాంక్రీట్‌ గోడను నిర్మిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆరోపించారు. ఆదివారం ఆయన ఆ గోడను పరిశీలించారు. దశాబ్దాల కింద పైనుంచి వచ్చే వరద నీరు వెళ్లేందుకు కల్వర్టు నిర్మించారని తెలిపారు. పాత జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కల్వర్టును వెడల్పు చేశారని వివరించారు. కానీ కల్వర్టు పక్కన భూమి కొనుగోలు చేసిన వారు దానికి అడ్డంగా నీరు వెళ్లకుండా కాంక్రీట్‌తో గోడ నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచే స్థానిక తహసీల్దారుకు ఫోన్‌ చేసి సమస్యను వివరించారు. అందుకు ఆయన స్పందించి వీఆర్‌ఏను పంపించి పనులను నిలిపి వేయించారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను బక్కని నర్సింహులు కోరారు.

Updated Date - 2023-03-12T23:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising