కుక్కల దాడిలో 3 మేక పిల్లలు మృత్యువాత
ABN, First Publish Date - 2023-03-02T23:47:05+05:30
కుక్కల దాడిలో మేకపిల్లలు మృత్యువాతపడిన ఘటన రాంనగర్ గ్రామంలో చోటుచేసుకుంది.
రాంనగర్‌లో కుక్కల దాడిలో మృత్యువాతపడిన మేక పిల్లలు
కులకచర్ల, మార్చి 2: కుక్కల దాడిలో మేకపిల్లలు మృత్యువాతపడిన ఘటన రాంనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం తన మామిడి తోటలో మేక పిల్లలను కట్టేసి భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లి చూడగా 3 మేకపిల్లలు మృత్యువాతపడి ఉన్నాయి. పక్కనే కుక్కల గుంపు కనిపించింది. కుక్కలు దాడి చేయడంతోనే మేక పిల్లలు మృత్యువాతపడ్డాయని రైతు శ్రీనివాస్ తెలిపాడు.
Updated Date - 2023-03-02T23:47:05+05:30 IST