న్యాక్ పరిశీలనకు ఎంపికైన వేళ.. డిగ్రీ కళాశాలకు రూ.1.55కోట్లు మంజూరు
ABN, First Publish Date - 2023-02-21T23:50:52+05:30
షాద్‌నగర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం మంగళవారం రూ.కోటి 55లక్షల రూపాయలను మంజూరు చేసింది.
షాద్‌నగర్‌అర్బన్, ఫిబ్రవరి 21: షాద్‌నగర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం మంగళవారం రూ.కోటి 55లక్షల రూపాయలను మంజూరు చేసింది. గ్రేడ్‌లను నిర్ణయించి నిధులు మంజూరు చేసే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యాక్ పరిశీలనకు ఎంపికైన వేళ కళాశాలకు నిధులు మంజూరు కావడం గమనార్హం. 2009లో ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఎనిమిది గదులను మాత్రమే పూర్తి చేసి, మరో 11గదుల నిర్మాణ పనులు మద్యలోనే నిలిచాయి. అసంపూర్తిగా ఉన్న భవనంతో పాటు జూనియర్ కళాశాల భవనంలోని కొన్ని గదులను డిగ్రీ కళాశాల నిర్వహణకు వినియోగిస్తున్నారు. డిగ్రీ కళాశాల కోసం ప్రభుత్వం 5ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.2కోట్ల 20 లక్షలతో భవన నిర్మాణ పనులు చేపట్టింది. కళాశాల న్యాక్ పరిశీలనకు ఎంపిన నేపథ్యంలో కళాశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని, కళాశాల భవన నిర్మాణ పనులు, ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేయించి, మౌలిక సదుపాయాలను కల్పించాలని కళాశాల సిబ్బంది ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు వివరించారు. కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే న్యాక్ వచ్చే వరకు సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనతో రూ.కోటి 55లక్షలు మంజూరు చేయించారు. త్వరగా నిర్మాణ పనులను చేపట్టి, న్యాక్ బృందం వచ్చే వరకు మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని కళాశాల సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Updated Date - 2023-02-21T23:50:53+05:30 IST