ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైనషాపు ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2023-10-16T01:00:18+05:30

మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదు తో ఎన్నికల, ఎక్సైజ్‌ అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వైనషాపు ఆకస్మిక తనిఖీ

తిరుమలగిరి(సాగర్‌), అక్టోబరు 15: మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదు తో ఎన్నికల, ఎక్సైజ్‌ అధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి మల్లయ్య, ఎక్సైజ్‌ ఎస్‌ఐ రేఖ తెలిపి న వివరాల ప్రకారం మండలకేంద్రంలో గల నూకల విద్యాసాగర్‌రెడ్డి వైనషాపులో నిబంధనలకు విరుద్ధంగా హోల్‌సేల్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేసి బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై తనిఖీ చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వైనషాపు నుంచి అక్రమంగా బెల్ట్‌ షాపులకు మద్యాన్ని విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం స్టాక్‌, కొనుగోలు, అమ్మకాల వివరాలను వారు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను దుకాణంలో పనిచేసేలా ఉంచాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. బెల్ట్‌ షాపులకు వైన షాపుల నిర్వాహకులు మద్యాన్ని అమ్మితే వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతోపా టు పలుచోట్ల బెల్ట్‌షాపులను తనిఖీ చేసి మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఎవరూ అ తిక్రమించినా ఉపేక్షిందేలేదని వారు అన్నారు. తనిఖీల్లో ఎన్నికల, ఎక్సై జ్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-16T01:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising