ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు సక్రమంగా రేషన అందించాలి : డీఎస్వో

ABN, First Publish Date - 2023-02-21T00:54:06+05:30

పేదలకు సక్రమంగా రేషన అందించాలని, బియ్యం పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన మర్రిగూడ, చండూరు మండలాల్లో పర్యటించారు.

మర్రిగూడలో రేషన దుకాణాన్ని తనిఖీ చేస్తున్న డీఎస్వో వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదలకు సక్రమంగా రేషన అందించాలి : డీఎస్వో

మర్రిగూడ, చండూరు, ఫిబ్రవరి 20: పేదలకు సక్రమంగా రేషన అందించాలని, బియ్యం పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన మర్రిగూడ, చండూరు మండలాల్లో పర్యటించారు. పలు రేషన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను, నిల్వలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన బియ్యాన్ని ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాల్సిన బా ధ్యత డీలర్లపై ఉందన్నారు. పీడీఎస్‌ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్ముకుంటే వారి కార్డులను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

మర్రిగూడ మండలకేంద్రంలోని 18,19 ప్రభుత్వ చౌకధరల దుకాణాలను పరిశీలించారు. డీలర్లు సమయపాలన పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ హబీబ్‌, నర్సింహ, డీలర్లు ఉన్నారు.

చండూరులో రేషన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ఆయన వెంట సివిల్‌ సప్లై అధికారి లింగస్వామి ఉన్నారు.

Updated Date - 2023-02-21T00:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising