ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రముఖ లలిత సంగీతకారుడు చిత్తరంజన్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2023-07-22T04:43:01+05:30

ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పని చేసిన మహాభాష్యం చిత్తరంజన్‌ (85) ఇకలేరు.

హైదరాబాద్‌ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో సుదీర్ఘ కాలం పని చేసిన మహాభాష్యం చిత్తరంజన్‌ (85) ఇకలేరు. వయసు రిత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగోల్‌లోని తన చిన్నకుమార్తె ఇంట్లో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చిత్తరంజన్‌ తండ్రి నిజాం ప్రభుత్వంలోని దక్కన్‌ రేడియోలో ఇంజనీర్‌గా పని చేశారు. తల్లి పెరిన్‌ దేవి దగ్గర సంగీత శిక్షణ పొందిన చిత్తరంజన్‌ తన ఏడో ఏట నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. అనంతరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యునిగా కొంతకాలం ఆయనతో కలిసి కచేరీలలో పాల్గొన్నారు. 1971- 1998 వరకు ఆలిండియా రేడియోలో లలిత గీతాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకునిగా పని చేశారు. సుమారు 15వేల పాటకు సంగీతం సమకూర్చారు. ఎనిమిది వేల పాటలు పాడి శ్రోతల అభిమాన గాయకుడిగా నీరాజనాలు అందుకున్నారు. లలిత సంగీత సౌరభం, లలిత సంగీతం-80 సంగీత సారస్వత మలయమారుతాలు తదితర పుస్తకాలు రాశారు. తెలుగు వర్సిటీ లలిత సంగీతం డిప్లమా కోర్సుకు పాఠ్యపుస్తకాల తయారీలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ప్రతిభకు మెచ్చి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో పాటు పలు సాంస్కృతిక, కళా సంస్థలు కళారత్న వంటి బిరుదులు, అవార్డులతో సత్కరించాయి. చిత్తరంజన్‌ అంత్యక్రియలు శనివారం జరగనున్నట్టు సమాచారం. సీనియర్‌ రచయిత సుధామ, కేంద్ర సాహిత్య అకాడమీ గిరిజన సాహిత్య కమిటీ జాతీయ సభ్యుడు సమ్మెట నాగమల్లేశ్వర రావు, రచయిత సీఎస్‌ రాంబాబు తదితరులు చిత్తరంజన్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.

Updated Date - 2023-07-22T04:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising