కూలి కోసం ఒడిశా కూలీల నిరసన
ABN, First Publish Date - 2023-06-26T00:51:55+05:30
ఒడిశా రాషా్ట్రనికి చెందిన సుమారు 20 మంది వలస కూ లీలు తాము చేసిన పనికి కూలి డబ్బులు ఇప్పించాలని ఆందోళ న చేపట్టారు. ఈ ఘటన కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది.
కూలి కోసం ఒడిశా కూలీల నిరసన
పోలీసుల జోక్యంతో కూలి డబ్బుల చెల్లింపు
సొంత రాషా్ట్రనికి బయలుదేరిన కూలీలు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఘటన
కొండమల్లేపల్లి, జూన 25: ఒడిశా రాషా్ట్రనికి చెందిన సుమారు 20 మంది వలస కూ లీలు తాము చేసిన పనికి కూలి డబ్బులు ఇప్పించాలని ఆందోళ న చేపట్టారు. ఈ ఘటన కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏపీ రాష్ట్రానికి చెందిన విజయరాఘవులు కొండమల్లేపల్లిలో నివాసం ఉం టూ, చిన్నఅడిశర్లపల్లి గ్రామం లో ఇటుకల బట్టీలను నిర్వహిస్తున్నాడు. మధ్యవర్తి ద్వారా ఇటుక బట్టీలో ఒడిశా రాష్ర్టానికి చెందిన కూలీలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం కూలీలు నిరసన వ్యక్తంచేశారు. పని కాలం ముగిసినా తమకు కూలి ఇవ్వడం లేదని హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై కొండమల్లేపల్లిలో ఆందోళనకు దిగారు. ఇటుక బట్టీ యజమాని తమకు విశ్రాంతి ఇవ్వకుండా పని చే యాల ని హింసించేవాడని వాపోయారు. కూలి సమయానికి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. పని ముగించుకొని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన తమకు కూలి ఇవ్వకుండా తీవ్ర ఇ బ్బందులు పెట్టాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. కార్మికుల సమస్యను తెలుసుకొని సదరు యజమాని విజయరాఘవులుతో మాట్లాడి వలస కూ లీలకు డబ్బులు చెల్లించేలా చొరవచూపారు. కూలి డబ్బులు అందుకున్న కూలీలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపి వారి సొంత రాషా్ట్రనికి పయనమయ్యారు.
Updated Date - 2023-06-26T00:51:55+05:30 IST